ముమ్మరంగా తనిఖీలు
ఇచ్చాపురం : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ పటిష్టంగా అమలు చేసే కార్యక్రమంలో భాగంగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని కాశీబుగ్గ డీఎస్పీ ఎం. శివరామిరెడ్డి అన్నారు. కవిటి మండలంలోని కొక్టీరియా టోల్ ప్లాజా వద్ద పలు వాహనాలను శనివారం తనిఖీ చేశారు. పొరుగున ఉన్న ఒడిశా నుంచి అక్రమ మద్యం, నగదు వంటివి మన రాష్ట్ర పరిధిలోకి రాకుండా ముందస్తుగా అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నామన్నారు. వాహనదారులు నిబంధనల మేరకు పోలీసులకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఇచ్చాపురం సీఐ ప్రసాద్, కవిటి ఎస్ఐ కె. రాము తదితరులు పాల్గొన్నారు.