సిని వార్తలు

గీతా సింగ్ ఇంట విషాదం.. జాగ్రత్తగా వుండాలని కరాటే కళ్యాణి…

హైదరాబాద్ : కితకితలు కమెడియన్, సినీ నటి గీతా సింగ్ ఇంట విషాదం నెలకొంది. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె దత్తత కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇంకా కారులో అయినా బైకుపై అయినా జాగ్రత్తగా వుండాలని… గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని.. ఓం శాంతి అంటూ పోస్టులో పేర్కొన్నారు. కితకితలు, ఎవడిగోల వాడిది వంటి సినిమాల ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న గీతా సింగ్ వివాహం చేసుకోలేదు.

తన సోదరుడి కుమారులను ఆమె దత్తత తీసుకున్నారు. తాజాగా కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోగా వీరిలో ఆమె పెద్ద కుమారుడు కూడా వున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గీతా సింగ్‌కు సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

Leave a Reply