ఆంధ్రప్రదేశ్

డ్రైవర్ నానిగా మారిన కొడాలి నాని- వీడియో వైరల్

గుడివాడ : వైఎస్సార్‌సీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇటీవల పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్టీసీ బస్సు నడుపుతూ ప్రత్యేక పాత్ర పోషించారు. ఆర్టీసీ అద్దెకు తీసుకున్న ఐదు కొత్త బస్సుల ప్రారంభోత్సవానికి నాని హాజరై, స్వయంగా చక్రం తిప్పాలని నిర్ణయించుకున్నారు.

గుడివాడ బస్టాండ్‌ నుంచి ప్రారంభించి సుమారు 10 కిలోమీటర్ల మేర బస్సును నడిపారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కొడాలి నానిని ‘డ్రైవర్ నాని’ అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు నెటిజన్లు.

Leave a Reply