ఆంధ్రప్రదేశ్

జియో ట్రూ 5జీ సేవలను ప్రారంభించిన ఏపీ మంత్రి గుడివాడ

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్‌ జియో ట్రూ 5జీ పేరిట ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుమల కొండపై 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని, ఏడాదిలోగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని జియో ప్రకటించింది. విజయవాడలో నిన్న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి సమక్షంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఈ సేవలను ప్రారంభించారు.

Leave a Reply