అంతర్జాతీయ వార్తలు

ట్విట్టర్కు కొత్త సీఈఓను వెతికే పనిలో ఎలాన్ మస్క్

అమెరికా : ట్విట్టర్కు​ కొత్త బాస్​ ఎలాన్​ మస్క్​ తన స్థానంలో కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. తెలివి తక్కువోడు దొరకగానే తాను తప్పుకుంటా అని అన్నారు ఎలన్‌మస్క్‌. అక్టోబరులో ట్విటర్‌ను సొంతం చేసుకున్న మస్క్‌.. ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్‌ సీఈఓగా కొనసాగాలా? వద్దా..? అని ప్రశ్నిస్తూ మస్క్‌ నిర్వహించిన పోల్‌లో ఎక్కువ మంది యూజర్లు.. ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో విధానపరమైన మార్పులకు సంబంధించి నిర్వహించే పోల్‌లో … కేవలం ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రైబర్లు మాత్రమే పాల్గొనేందుకు వీలుగా మార్పులు చేయనున్నట్లు తెలిపారు. అయితే, యూజర్లు తనకు వ్యతిరేకంగా ఓటు వేయడం వల్ల ట్విటర్‌ సీఈఓగా వైదొలగాలని మస్క్‌ భావిస్తున్నారు. ఈ మేరకు ట్విటర్‌కు కొత్త బాస్‌ను అన్వేషించే పనిలో.. మస్క్ నిమగ్నమయ్యారు.

Leave a Reply