ఆంధ్రప్రదేశ్

ఇలాగైతే.. నీరు పట్టేదెలా..

ఇచ్చాపురం : ఇచ్చాపురం మండలం ఈదుపురంలో ప్రధాన వీధి రోడ్డుకు ఆనుకుని ఉన్న తాగునీటి కుళాయి దిమ్మెలో కొంత భాగాన్ని కాలువ నిర్మాణంలో భాగంగా తొలగించారు. అనంతరం దాన్ని పునరుద్ధరించకపోవడంతో కనీసం బిందె పెట్టుకొనే స్థలం కూడా లేకుండా పోయింది. కుళాయికి రెండు ట్యాప్ ఉండాల్సి ఉండగా ఒక్కటే బిగించారు. దీంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. సిమెంటు దిమ్మె నిర్మించడంతోపాటు అదనపు ట్యాప్ ఏర్పాటుచేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి తిరుపతిరావును వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Leave a Reply