ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోని కొనసాగించాలి

గాజువాక : ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు జె. రామకృష్ణ , స్టీల్ ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలో వుంటేనే అభివృద్ధి జరుగుతుందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు జె. రామకృష్ణ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 705వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించబోమని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసేంత వరకు తాము పోరాటాలను కొనసాగిస్తామన్నారు. ఉక్కు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 30న నిర్వహించనున్న కార్మిక ప్రజా గర్జనలో అన్ని వర్గాల వారు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ మొండి వైఖరిని విడనాడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్‌. రామారావు, వరసాల శ్రీనివాసరావు, కె. పరంధామయ్య, సన్యాసిరావు, శ్రీనివాసనాయుడు, గుమ్మడి నరేంద్ర, డేవిడ్‌, తదితరులతో పాటు డబ్ల్యూఆర్‌ఎం విభాగం ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply