ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి రమ్మని చంద్రబాబు ఆహ్వానించారు: బీజేపీ నేత

శక్తి టీవీ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అంటే తనకు చాలా అభిమానం అని.. ఆయనకు తానంటే ఎంతో ప్రేమ అని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. తన మీద ప్రేమతో 2019లో చంద్రబాబు తనను టీడీపీలోకి ఆహ్వానించారన్నారు. అలాగే జగన్ కూడా వాళ్ల మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డితో పాటు ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని పంపి తనకు మంత్రి పదవి ఇస్తామన్నారని చెప్పారు.

అయితే రెండు పార్టీల ఆఫర్లను తిరస్కరించినట్లు ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తనకు రాజకీయంగా జీవితం ఇచ్చిందని.. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలో నిర్ణయించుకునేందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు తప్పదని జనం అనుకుంటున్నారని స్పష్టం చేశారు.

హైదరాబాద్ వస్తుంటే బాధ, సంతోషం కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఓ తెలుగు రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని సంతోషంగా ఉన్నా.. ఏపీ అభివృద్ధి చెందడం లేదనే బాధగా ఉందన్నారు. ఏపీని జగన్ సర్వనాశనం చేశారని విష్ణుకుమార్ రాజు విమర్శించారు.

Leave a Reply