ఆంధ్రప్రదేశ్

దిశ యాప్‌ పై మరోసారి డ్రైవ్‌ చేపట్టండి: సీఎం జగన్

శక్తి టీవీ, వెబ్ డెస్క్: ఏపీ హోంశాఖపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. సమావేశంలో అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. సోషల్‌ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుకట్ట వేయాలని సీఎం సూచించారు. దీనిపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులకు ఖచ్చితమైన ప్రోటోకాల్‌ ఉండాలని అధికారులకు తెలిపారు. దిశ యాప్‌ మీద మరోసారి డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. ప్రతి ఇంట్లో కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారా? లేదా? అన్నదానిపై పరిశీలన చేయాలని సూచించారు. దిశ యాప్‌ వల్ల జరిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రతి ఇంటికీ కరపత్రం ఇవ్వాలని అన్నారు. మాదకద్రవ్యాలను పూర్తిగా నివారించదానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. రవాణా, పంపిణీ, వినియోగంపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపాలని.. అలాగే డ్రగ్‌ పెడలర్స్‌ పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు.. వీరికి శిక్షలు పెంచేలా ఆలోచన చేయాలని అధికారులకు సూచించారు.

Leave a Reply