ఆంధ్రప్రదేశ్

గతేడాది బిల్లులే ఇవ్వలేదు.. అధికార పార్టీ సర్పంచి ఆవేదన

నరసన్నపేట : గతేడాది అధికారులు చెప్పిన పనులు చేసినందుకు రూ. 7 లక్షలు ఖర్చయ్యింది. అందులో జడ్పీ నుంచి రావాల్సిన రూ. 5 లక్షలు నేటికీ చెల్లించలేదు. మళ్లీ ఈ ఏడాది కూడా పని చేయమంటున్నారు. ఎలా చేయగలం అంటూ అధికార పార్టీ సర్పంచి అధికారులను ప్రశ్నించిన ఘటన శ్రీముఖలింగంలో చోటుచేసుకుంది. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలకు సన్నద్ధత సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఆర్డీవో బొడ్డేపల్లి శాంతి మాట్లాడుతూ ఉత్సవాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని కోరారు. దీంతో అక్కడే ఉన్న సర్పంచి అధికార పార్టీ నాయకుడు తమ్మన్నగారి సతీష్ కుమార్ తన ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది ఉత్సవాలకు గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, నదికి వెళ్లే మార్గం మరుగుదొడ్లు, కరకట్టపై మొక్కల తొలగింపు వంటి పనులు చేపట్టినా నేటికీ బిల్లులు చెల్లించలేదని వాపోయారు. దీనిపై ఆర్డీవో స్పందిస్తూ కలెక్టరు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేలా చర్యలు చేపడతానన్నారు.

Leave a Reply