ఆంధ్రప్రదేశ్

అక్రమ రవాణా చేస్తే సహించేది లేదు

టెక్కలి : జిల్లాలో గ్రానైట్ బ్లాకుల అక్రమరవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు భూగర్భగనుల శాఖ ఏడీ ఫణిభూషణ్ రెడ్డి బుధవారం తెలిపారు. టెక్కలి లో విజిలెన్స్ అధికారుల నిఘా మరింత పెంచినట్లు వెల్లడించారు. ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించి అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే అనుమానిత క్వారీ యజమానులకు హెచ్చరికలు జారీ చేసినట్లు టెక్కలి కి చెందిన అధికారులు బుధవారం తెలిపారు.

Leave a Reply