ఆంధ్రప్రదేశ్

ఐదు రోజుల పాటు జరగనున్న సీఐటీయూ ఆలిండియా మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి కోరారు

పలాస : బెంగళూరులో ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న సీఐటీయూ ఆలిండియా మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి కోరారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణ నందు సీఐటీయూ ఆధ్వర్యంలో సీఐటీయూ జండాను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలను నికరంగా వ్యతిరేకిస్తూ , కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక సంఘం సీఐటీయూ అని అన్నారు. సభలలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై గతంలో జరిగిన పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వై యజ్ఞ, ఎస్ శ్రీలత, పి తులసమ్మ, వి కృష్ణారావు, కె రాజారావు, ఎన్ డిల్లేశ్వరి , కె వెంకటరావు, తాతయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply