ఆంధ్రప్రదేశ్

తెలంగాణను కాపాడలేని కేసీఆర్.. విశాఖ ఉక్కును కాపాడతారా?: కేఏ పాల్

విశాఖపట్టణం : వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం తన ఆస్తులనైనా అమ్ముతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. విశాఖపట్టణంలో కేఏ పాల్ ను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పాల్.. ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. సొంత రాష్ట్రం తెలంగాణను కాపాడలేని కేసీఆర్.. స్టీల్ ప్లాంట్ ను కాపాడతారా? అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులు పాలు చేశారని విమర్శించారు. అలాగే అంతమంది వైసీపీ ఎంపీలు ఉన్నా కేంద్రంపై జగన్ ఎందుకు పోరాడడం లేదని మండిపడ్డారు. ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకే పాల్ ను కలిశానని లక్ష్మీనారాయణ తెలిపారు. కార్మికుల కోసం ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తానని జేడీ వెల్లడించారు.

Leave a Reply