ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

విజయనగరం : ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో మార్చి 13న పోలింగ్ జరిగే భోగాపురం జడ్పీహెచ్ స్కూల్ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం. దీపిక, ఐపీఎస్ సందర్శించి, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించి, 200మీటర్ల పరిధిలో ఓటు హక్కు వినియోగించుకొనే వారు ఇంకెవ్వరూ లేకుండా చూడాలని అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు సిబ్బందిని ఆదేశించారు.జిల్లా ఎస్పీ వెంట ఎస్బి సిఐ జి. రాంబాబు, భోగాపురం సిఐ విజయనాధ్, ఎస్ఐ కృష్ణమూర్తి మరియు ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Leave a Reply