ఆంధ్రప్రదేశ్

అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా మూతబడిన మద్యం షాపులు

అనకాపల్లి : అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా శనివారం ప్రభుత్వ మద్యం షాపులు మూతపడ్డాయి. ఈనెల 13న జరగనున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి సుభాన్ పటాన్ శెట్టి ఆదేశాల మేరకు వైన్ షాపులు మూసివేసినట్లు మద్యం షాపు ఉద్యోగులు తెలిపారు. ఎన్నికల అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం షాపు తెరిచే అవకాశం ఉందని తెలిపారు.

Leave a Reply