ఆంధ్రప్రదేశ్

వందలాది ఎకరాల్లో అకేషియా వనాలు దగ్ధం

అచ్చుతాపురం : దొప్పెర్ల అటవీ ప్రాంతంఓ శుక్రవారం సాయంత్రం మంటలు వ్యాపించాయి. దీంతో ఈ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచా రం అందించారు. దీంతో ఎలమంచిలి, అనకాపల్లి నుంచి రెండు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినా, సాయంత్రానికి కూడా ఫలితం లేకపో యింది. అడవిలోకి వాహనాలు వెళ్లడానికి రహదారి లేకపోవడంతో చేసేది లేక అగ్నిమాపక సిబ్బంది వెనుదిరి గారు. ప్రస్తుతం అడవి మధ్య నుంచి మంటలు కనిపించకపోయినప్పటికీ దట్టమైన పొగలు మాత్రం వస్తున్నాయి.

Leave a Reply