ఆంధ్రప్రదేశ్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అవినాష్​ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ : మాజీ మంత్రి వైఎస్​ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మూడోసారి సీబీఐ విచారణకు హాజరు కాకముందే ముందస్తుగా జాగ్రత్త పడ్డారు. తొలిసారి జనవరి 28న, రెండోసారి ఫిబ్రవరి 24న హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మార్చి 10న మరోసారి విచారణకు రావాలని ఈ నెల 5న సీఆర్పీసీ 160 కింద సీబీఐ అధికారులు నోటీసు ఇచ్చారు. ఈ క్రమంలో గురువారం తెలంగాణ హైకోర్టులో అవినాష్‌ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

Leave a Reply