ఆంధ్రప్రదేశ్

చీరాల మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారా?

చీరాల : చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు (స్వాములు) జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారనే వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు దారి తీసింది.

ఆమంచి కృష్ణ మోహన్ ఇటీవల పర్చూరు నియోజకవర్గ వైసీపీ బాధ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఓ ఫ్లెక్సీ చర్చకు దారితీసింది.

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో అభిమానులు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫె ఆ ఫ్లెక్సీపై జనసేనాని పవన్ కల్యాణ్, స్వాములు ఫొటోను ముద్రించారు. ఈ ఫ్లెక్సీతో ఆమంచి సోదరుడు త్వరలోనే జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ చర్చ మొదలైంది.

Leave a Reply