ఆంధ్రప్రదేశ్

విశాఖలో విషాదం.. SPF కానిస్టేబుల్ బలవన్మరణం..

శక్తి టీవీ, విశాఖ :- విశాఖలో SPF కానిస్టేబుల్ శంకర్రావు బలవన్మరణం చెందారు. తన దగ్గరున్న SLRతో తనకు తానే కాల్చుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ద్వారక పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. శంకర్రావుకి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

విశాఖలో SPF కానిస్టేబుల్ శంకర్రావు బలవన్మరణం చెందారు. తనకు తానే గన్ తో కాల్చుకున్నట్లు తెలుస్తోంది. ద్వారక పీఎస్(Dwaraka PS) పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం 5 గంటలకు డ్యూటీకి హాజరైన శంకర్రావు(Shankar Rao) తన దగ్గరున్న SLRతో కాల్చుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుల్ శంకర్రావు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయాలపై ఆరా తీసుకున్నారు. IOBలో శంకర్రావ్ గన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కానిస్టేబుల్ శంకర్రావు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది.

పిరికివాడు కాదు..

మృతుని తండ్రి మాట్లాడుతూ.. మా అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాదని వాపోతున్నారు. తమతో బాగానే ఉన్నాడని.. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, గొడవలు లేవని పేర్కొన్నారు. ఇలా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో అర్థం కావడం లేదంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. కుటుంబం మొత్తం తీవ్రమైన శ్లోకంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply