ఆంధ్రప్రదేశ్

పురందేశ్వరి లెటర్ లో ఏముంది ?

శక్తి టీవీ, ఏపీ :- ఓ లెటర్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. ఆ లెటర్‌ చుట్టూనే రాజకీయం చక్కర్లు కొడుతోంది. అలా ఎలా రాస్తారని కొందరు.. రాస్తే తప్పేంటని మరికొందరు.. ఇలా రెండు వర్గాలుగా విడిపోయి మాటల కత్తులు దూసుకుంటున్నారు. ఇంతకీ ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి లేక ఎందుకు కాక రేపుతోంది. ఇంతకీ ఆ లేఖలో ఉన్న వివాదస్పద అంశాలేంటి?

మనం ఇప్పటికే చాలా సార్లు చెప్పుకున్నాం. ఏపీలో ఎన్నికల ముందు ఏ చిన్న అంశమైనా అది బ్రేకింగ్ న్యూసే. అలాంటిది రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎలక్షన్‌ కమిషన్ మార్చడం చాలా పెద్ద విషయం. ఇప్పటికే ఈ విషయంపై అధికార, విపక్షాల మధ్య దుమారం రేగుతోంది. అయితే వారిని ఉన్నట్టుండి ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేశారు? ఎవరు ఫిర్యాదు చేశారు? అన్న ప్రశ్నలకు సమాధానం దొరికింది. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి రాసిన లెటర్‌ కారణంగానే ఈ బదిలీలు జరిగాయని ఆలస్యంగా తెలియడంతో రాష్ట్రంలో రాజకీయం మరింత హీటేక్కింది.

ఒకరు కాదు.. ఇద్దురు కాదు.. ఏకంగా 22 మంది ఐపీఎస్ అధికారులను మార్చాలంటూ పురందేశ్వరి ఎలక్షన్ కమిషన్‌కు లేటర్ రాయడం అనేది సీరియస్ ఇష్యూనే. అందులో వారిని ఎందుకు మార్చాలో.. ఎవరిపై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో.. పూసగుచ్చినట్టు క్లారిటీగా వివరించారు. అయితే ఓ పార్టీ చీఫ్‌ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయడం తప్పు కాదు. ఫలానా అధికారులపై ఆరోపణలు చేయడం అసలు తప్పే కాదు. వారు ఎలాంటి వారు? వారిపై వ్యక్తిగతంగా ఎలా ప్రవర్తిస్తున్నారు? ఇది కూడా తప్పే కాదు. కానీ వారి స్థానంలో ఎవరిని నియమించాలో కూడా చెప్పడమే.. ఇక్కడ వివాదానికి కారణమైంది.. అనేక సందేహాలను తెరపైకి తీసుకొచ్చింది.

ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తూ కొందరిపై.. అధికారుల పర్సనల్ ఇష్యూస్‌ను రెయిస్‌ చేస్తూ మరికొందరిపై.. ఎన్నికల విధులతో సంబంధంలేని అధికారులను వేరే రాష్ట్రానికి పంపాలంటూ మరికొందరిని.. ఇలా సాగుతూ వెళ్లింది ఆమె లెటర్‌లోని ఆరోపణల లిస్ట్. దీనిపైనే ఇప్పుడు అధికార వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇవే కాదు.. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌లో జరుగుతుందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన చెబితేనే పురందేశ్వరి లెటర్ రాశారన్న విమర్శలు వచ్చాయి.

అయితే అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి విపక్షాలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై మాత్రమే తాము ఫిర్యాదు చేశామని.. అంతేకాని తమకు అధికారులపై ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవంటున్నారు బీజేపీ నేతలు. అంతేకాదు వారిని ఆ స్థానాల నుంచి తప్పించే వరకు పోరాడుతూనే ఉంటామని బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. టీడీపీ నేతలైతే ఏకంగా వార్నింగ్ ఇస్తున్నారు. నేతల కోసం కాదు ప్రజల కోసం మాత్రమే పనిచేయాలని, హద్దు మీరి ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

వారి మాటలు విన్నాం.. వీరి మాటలు కూడా విన్నాం.. రాజకీయ విమర్శలు, పరసర్ప ఆరోపణలు కామన్. కానీ ఫలానా అధికారిని పక్కనపెట్టండి అని చెప్పడం వరకు ఓకే. కానీ ఆయన స్థానంలో ఫలానా వారిని కూర్చోబెట్టండి అంటూ నేరుగా ఈసీకే సూచించడంపైనే అసలు రగడ జరగుతోంది. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా కావాలనే రాసిన లేఖనా? తమకు అనుకూలంగా పనిచేసే వారిని నియమించుకోవాలనే కుట్రనా? అందుకే ఈ లేఖను రాశారా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు.

ఈ లెటర్‌ను పురంధేశ్వరి మార్చి 26న ఈసీకి పంపించారు. ఆ లిస్ట్ లో ఉన్న కొందర్ని ఎన్నికల కమిషన్ ఇప్పటికే బదిలీ చేసింది. అంటే ఆమె పోరాటం కొంచెం ఫలించినట్టే. కానీ ఆమె చెప్పినవారికి మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు ఈసీ. నిజానికి ఎలక్షన్ కమిషన్ తన నిర్ణయాలను సీఎస్ ద్వారా అమలు చేస్తోంది. పురందేశ్వరి చెప్పినా.. చెప్పకపోయినా.. ఇతర అధికారులకు పోస్టింగ్ ఇస్తుంది. కానీ లెటర్‌లో ఉన్నవారికే పోస్టింగ్ ఇస్తే మాత్రం.. వైసీపీకి ఇదో అస్త్రంగా మారనుంది.

Leave a Reply