ఆంధ్రప్రదేశ్

ఇంటి వద్దకే జగనన్న సురక్ష పథకం

శక్తి టీవీ, రామ‌చంద్రాపురం: జగనన్న సురక్ష పథకంద్వారా ధృవపత్రాలను పొందడం సులభతరమవుతుందని రామచంద్రాపురం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవీ అన్నారు. బుధవారం స్థానిక 5, 6 సచివాలయాల పరిధిలో జగనన్న సురక్ష పధకం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవీ మాట్లాడుతూ ఇంటివద్దకే లబ్దిదారులకు ధృవపత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply