జాతీయ వార్తలు

నిరుద్యోగులను అదిరిపోయే శుభవార్త.. డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

శక్తి టీవీ, ఢిల్లీ :- ఢిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ ..సెంట్రల్‌ ఆర్మ్‌ డ్‌ ఫోర్సెస్‌ లో ఉద్యోగాలకు 2024 నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. 506 అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

UPSC CAPF 2024: ఢిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ ..సెంట్రల్‌ ఆర్మ్‌ డ్‌ ఫోర్సెస్‌ లో ఉద్యోగాలకు 2024 నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఈ పరీక్ష ద్వారా బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌, సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, ఇండో -టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ , సశస్త్ర సీమా బల్‌ లో 506 అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

డిగ్రీ పూర్తైన యువతీయువకులు ఈ పోస్టులకు ఆన్‌ లైన్‌ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులకు చివరి తేదీ , తదితర వివరాలను వెబ్‌సైట్‌ లో చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 506

బీఎస్‌ఎఫ్‌- 186
సీఆర్‌పీఎఫ్‌- 120
సీఐఎస్‌ఎఫ్‌- 100
ఐటీబీపీ- 58
ఎస్‌ఎస్‌బీ- 42

ఇతర సమాచారం :

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయో పరిమితి: 01-08-2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), ఫిజికల్ స్టాండర్డ్స్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాలి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: మే 14, 2024
దరఖాస్తు సవరణ తేదీలు: మే 15 నుంచి 21 వరకు.
రాత పరీక్ష తేదీ: ఆగస్టు 4, 2024.

Leave a Reply