జాతీయ వార్తలు

బ్రేకప్ చెప్పినందుకే కిరాతకంగా చంపేశాడు: పోలీసులు

శక్తి టీవీ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన బాలిక హత్య కేసులో పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. తన ప్రేమకు బ్రేకప్ చెప్పడంతోనే హత్య చేసినట్లు తెలిపారు. 2021 నుంచి సాక్షితో సాహిల్ ప్రేమలో ఉన్నారని.. అయితే ఆమె అతడికి బ్రేకప్ చెప్పాలని నిర్ణయించుకుందన్నారు. హత్యకు ఓ రోజు ముందే వారి మధ్య మాటలు పూర్తిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. కానీ మళ్లీ కలుద్దామంటూ బాలికను సాహిల్ పదే పదే కోరాడని చెప్పారు. అయితే అందుకు ఆమె అంగీకరించకపోవడంతో కోపోద్రిక్తుడైన నిందితుడు కిరాతకంగా హత్య చేసినట్లు వెల్లడించారు. సాక్షిని చంపినందుకు అతడికి పశ్చాత్తాపం కూడా లేదన్నారు.

కాగా ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో 16 ఏళ్ల సాక్షి అనే టీనేజర్‌ను ఆమె బాయ్‌ఫ్రెండ్ సాహిల్ దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. నడిరోడ్డుపై 20 సార్లు కత్తితో పొడిచి బండరాయితో నెత్తిపై మోది కిరాతకంగా చంపేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దారుణ ఘటనను సీఎం కేజ్రీవాల్‌తో పాటు మహిళా కమిషనర్ స్వాతి మలివాల్ తీవ్రంగా ఖండించారు.

Leave a Reply