జాతీయ వార్తలు

అత్యాచారం చేసిన కామాంధుడి తల్లిపై బాధితురాలు కాల్పులు

ఢిల్లీ : ఢిల్లీలోని భాజన్‌పురలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధుడి తల్లిని బాధితురాలు చెరబట్టింది. నిందితుడి తల్లిపై తుపాకీతో బాధితురాలు కాల్పులు జరిపింది. అయితే, అదృష్టవశాత్తు అది మిస్ ఫైర్ కావడంతో నిందితుడి తల్లి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ షాకింగ్ ఘటన వివరాలను పరిశీలిస్తే,

భాజన్‌పురలో ఉంటున్న ఓ బాలికపై గత యేడాది అత్యాచారం జరిగింది. దీంతో ఆ బాలిక పోలీసులు ఆశ్రయించింది. స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, బాధితురాలితో పాటు అత్యాచారానికి పాల్పడిన యువకుడు కూడా మైనర్ కావడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపిన తగిన చర్యలు తీసుకున్నారు.

ఈ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది. తాజాగా ఈ కేసులోని నిందితుడైన తల్లిపై బాలిక తుపాకీతో కాల్పులు జరిపింది. అయితే, అది మిస్ ఫైర్ అయినప్పటికీ, ఈ ఘటనపై ఆమె గాయపడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకునమ్నారు.

Leave a Reply