రేషన్ డీలర్ల సమ్మె బాట.. నేటి నుంచి ఆందోళనలు..
శక్తి టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో నేటి నుంచి రేషన్ డీలర్లు సమ్మె బాట పడుతున్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో నిరసనకు దిగుతున్నారు. 17,200 మంది రేషన్ డీలర్లు రిలే నిరాహార దీక్షలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
గత నెలలో రేషన్ డీలర్ల సంఘంతో ప్రభుత్వం చర్చలు జరిపింది. వారి డిమాండ్లపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అయితే ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ ముందుకు సాగలేదు. దీంతో ప్రభుత్వం మాటలకే పరిమితమైందని డీలర్లు మండిపడుతున్నారు.
డీలర్ల సమ్మెతో రేషన్ పంపిణీ నిలిచిపోనుంది. ఈ వ్యవహారంపై స్పందించిన పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పారు. తెలంగాణలో గత నెలలో జూనియర్ పంచాయతీ కార్యదర్శలు సమ్మె చేశారు. వారి ఆందోళనలు తీవ్రం కావడంతో ప్రభుత్వ చర్చలు జరిపింది. వారి డిమాండ్లు నెరవేర్చందుకు అంగీకరించింది. దీంతో జేపీఎస్ లు నిరసన విరమించి విధుల్లో చేరారు. మరి ప్రభుత్వం రేషన్ డీలర్ల ఇష్యూను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.