తెలంగాణ

జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపు.. బాలయ్య ఆదేశాలతో తీసేశారా..?

శక్తి టీవీ, తెలంగాణ :- నందమూరి కుటుంబంలో ఏం జరుగుతోంది? బాబాయ్‌ అబ్బాయ్‌కి చెడిందా.? జూనియర్ పై బాలయ్య కోపం పెంచుకున్నారా? ఇవే డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే.. చంద్రబాబు అరెస్టుపై ఇప్పటివరకు ఒక్క మాట కూడా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడలేదు. కనీసం సోషల్ మీడియా వేదికగానైనా ట్వీట్ చేసింది లేదు. అందుకే ఎన్టీఆర్ ను బాలయ్య, నారా ఫ్యామిలీలు పక్కనపెడుతున్నాయని రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలను చూస్తే అర్థమవుతోంది.

నేడు టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ 28వ వర్ధంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నందమూరి కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ముందుగా జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. తర్వాత బాలకృష్ణ, రామకృష్ణ తదితరులు ఘాట్ వద్ద నివాళులర్పించారు.

ఇవాళ జరిగిన పరిణామాలు చూస్తే.. ఆ ప్రచారానికి బలం చేకూరుతుంది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీసేయాలని బాలకృష్ణ చెప్పారంటూ ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియో చూసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటిని గమనిస్తే.. నందమూరి కుటుంబంలో అగ్గి పుట్టిందని.. అది ఇవాళో.. రేపో కార్చిచ్చు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

ఎన్టీఆర్‌కు సపోర్ట్‌గా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని రంగంలోకి దిగాడు. ఫ్లెక్సీలను తొలగించినంత మాత్రాన జూనియర్ వచ్చిన నష్టమేమీ లేదన్నారు. వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా తమని ఏమీ చేయలేరని తెలిపారు. లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఓవరాల్ గా తాజా ఎపిసోడ్‌ తో ఏపీ పాలిటిక్స్‌ మరోసారి జూనియర్‌ ఎన్టీఆర్‌ చుట్టూ తిరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్టు సమయంలోనూ సోషల్ మీడియాలో టీడీపీ ఫ్యాన్స్ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ మధ్య వార్ జరిగింది. మా వాడివే కానీ మాలో ఒకడివి కాదంటూ ఎన్టీఆర్‌పై టీడీపీ ఫ్యాన్స్ ట్రోలింగ్‌ చేశారు. అంతేకాదు టీడీపీపై నమ్మకం లేని వ్యక్తి భవిష్యత్తులో పార్టీని ఎలా లీడ్ చేస్తారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్‌పై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమని మండిపడ్డారు.

అయితే అప్పుడే టీడీపీ ఫ్యాన్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. సినిమాల్లో బిజీగా ఉన్న ఆయనను రాజకీయాల్లోకి లాగొద్దంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. పార్టీ మంచిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ను ఎవరూ పట్టించుకోలేదని .. కష్టాలు వచ్చినప్పుడు కావాలా అంటూ కౌంటరిచ్చారు.

మరి ఇప్పుడు బాలకృష్ణ కామెంట్స్ పై జూనియర్ స్పందిస్తాడా.. అనేది తెలియాలి. చంద్రబాబు అరెస్టుపైనే నోరెత్తని జూనియర్ ఇప్పుడు దీన్ని పట్టించుకునే ఛాన్సే లేదని చెబుతున్నారు అతని ఫ్యాన్స్. ఈ వివాదం ఎక్కడివరకు వెళ్తుందో.. త్వరలో జరిగే ఏపీ ఎన్నికల్లో దీని ఇంపాక్ట్ ఉంటుందా అన్నది వెయిట్ అండ్ సీ.

చంద్రబాబు, బాలకృష్ణతో.. జూ. ఎన్టీఆర్ కు గ్యాప్ పెరిగిందని.. నందమూరి ఫ్యామిలీలో విభేదాలు నెలకొన్నాయనే ప్రచారం జరుగుతోంది. అందువల్లే జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించి కేవలం చంద్రబాబు, బాలకృష్ణకు సంబంధించిన ఫ్లెక్సీలు మాత్రమే ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉంచారని టాక్ వినిపిస్తోంది. అయితే నిజంగా వారి మధ్య విభేదాలు ఉన్నాయా? అ ఫ్లెక్సీలు తీయమని నిజంగా బాలకృష్ణ చెప్పారా? తీసింది ఎవరు? ఎందుకు తీశారనేది తెలియాల్సి ఉంది.

Leave a Reply