తెలంగాణ

24 వేళ్ళతో జన్మించిన వింత శిశువు

నిజామాబాద్ : ఆధునిక కాలంలో ఎక్కడో ఒకచోట బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానంలో ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు జరుగుతూనే ఉంటుంది. తాజాగా మరో వింత ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఎర్గట్లకు చెందిన రవళి అనే మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ శిశువు ఏకంగా 24 వేళ్ళతో జన్మించాడు. దీంతో అక్కడివారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ శిశువు చేతులకు, కాళ్లకు మొత్తం కలిపి 24 వేళ్ళు ఉండటాన్ని ఆపరేషన్ చేసిన డాక్టర్లు గుర్తించారు. అయితే ఈ శిశువుకు ఎలాంటి ప్రాణహాని లేదని… ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయని తెలిపారు.

Leave a Reply