తెలంగాణ

వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర ఉంది: సీబీఐ

హైదరాబాద్ : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ అధికారులు తెలిపారు. వివేకా హత్యకు ముందు, తర్వాత నిందితులతో భాస్కర్ రెడ్డి మాట్లాడారని తెలిపారు. హత్య కేసు ఆధారాలు చెరిపేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. అందుకే కుట్రకోణం(120B), మర్డర్ (302) సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదుచేశామన్నారు. 2017ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోవడం వెనక అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. వివేకా వల్ల రాజకీయంగా ఎదుగుదల ఉండదని భావించిన ఇద్దరు.. ఆయనను అడ్డు తొలగించుకునేందుకే హత్య చేసినట్లు అనుమానిస్తున్నట్లు వెల్లడించారు.

Leave a Reply