తెలంగాణ

గ్రేటర్ మేయర్ గదిలోకి ఐదువేల కుక్కలను పంపాలి: RGV

హైదరాబాద్ : కుక్కలను ప్రేమగా చూడాలన్న గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి వ్యాఖ్యలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. బాలుడిని చంపేసినట్టు వంటి ఐదు వేల వీధి కుక్కల మధ్యలో మేయర్ ను ఉంచి తాళాలు వేయాలని మంత్రి కేటీఆర్ ను రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు ఆమె కుక్కలపై ఎంత ప్రేమ చూపిస్తుందో చూడాలని ఆర్జీవీ ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశాడు. కొన్నిరోజుల క్రితం అంబర్ పేటలోని కుక్కుల దాడిలో ఓ బాలుడు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన అనంతరం మీడియాతో మాట్లాడిన మేయర్ విజయలక్ష్మి కుక్కలను ప్రేమగా చూడాలని.. వాటికి ఆహారం అందించాలని ప్రజలను కోరారు. ఈ వ్యాఖ్యలపై ఆమెకు కౌంటర్లు ఇస్తూ RGV వరుస ట్వీట్స్ చేస్తున్నాడు.

Leave a Reply