ఆంధ్రప్రదేశ్

గృహ సారధుల బాధ్యతలపై సమావేశాలు

టెక్కలి : టెక్కలి మండల పరిధిలోని టెక్కలి, బొప్పాయిపురం, ఆయోధ్యాపురం, సచివాలయాలలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆదేశాలు మేరకు జెడ్పీటీసీ దువ్వాడ వాణి అధ్యక్షతన సమావేశాలు జరిగాయి. ఈ మేరకు టెక్కలి మండల సచివాలయాల కన్వీనర్ శిగిలిపల్లి మోహన్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం సచివాలయం కన్వీనర్లు, గృహసారధులు బాధ్యతలపై సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆట్ల సరోజినమ్మ , బొప్పాయిపురం సర్పంచ్ గుజ్జు మోహన్ రెడ్డి, అక్కవరం సర్పంచ్ భూలక్ష్మి అప్పలనాయుడు, పరశురామ్ పురం సర్పంచ్ కామేష్, సీతాపురం సర్పంచ్ ప్రతినిధి జగ్గారావు, పెద్దసాన సర్పంచ్ ప్రతినిధి లోళ్ల రాంబాబు, ఆయోధ్యపురం సర్పంచ్ బగాది హరి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply