జాతీయ వార్తలు

రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య ఇంట్లో దొంగతనం, దొంగలు ఎవరో తెలుసా..?

చెన్నై : గత 18ఏళ్లుగా ఇంట్లో పనిచేసిన ఈశ్వరి దొంగిలించిన నగలు అమ్మి ఆ డబ్బుతో ఇంటిని కొనుగోలు చేసిందని పోలీసులు వెల్లడించారు. నివాసానికి సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరునెలల కిందట పనిమానేసిన పనిమనిషి ఈశ్వరి బ్యాంకు ఖాతాలో రూ.లక్షల నగదు లావాదేవీలను దర్యాప్తులో భాగంగా పోలీసులు గుర్తించారు. అయితే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ ఇంట్లో ఇటీవల దొంగతనం జరిగిన తెలిసిందే. సుమారు రూ.60 లక్షల విలువ చేసే బంగారు, వజ్రాల ఆభరణాలు గురయ్యాయి.

ఈ వ్యవహారంపై ఐశ్వర్య తేనాం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరు మహిళలతో పాటు డ్రైవర్‌ వెంకటేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఐశ్వర్య అనుమానించినట్లుగానే ఇంట్లో పనివాళ్లే ఈ చోరీ చేసినట్లు విచారణలో తేలింది. పోలీసుల సమాచారం ప్రకారం.. చెన్నైలో ఐశ్వర్య ఉంటున్న నివాసంలో దాదాపు 18 ఏళ్లుగా పని చేస్తున్న మండవేలికి చెందిన ఈశ్వరి, మరో మహిళ లక్ష్మి, డ్రైవర్‌ వెంకటేశ్‌తో పాటు మరో ముగ్గురు ఈ దొంగతనానికి తెగబడ్డారు.

దొంగలించిన ఆభరణాలను అమ్మి ఆ డబ్బుతో చెన్నైలో ఓ ఇల్లుతో పాటు పలు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసినట్టు నిందితులు విచారణలో తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. కాగా కొంతకాలంగా ఐశ్వర్య ఇంటిలోని విలువైన వస్తువులను కూడా దొంగిలించినట్లుగా పోలీసులు విచారణలో గుర్తించారు. ఇటీవల ఇంట్లో చోరి జరగడంతో పోలీసుల ఆశ్రయించిన ఐశ్వర్య తన ఇంటి పనివాళ్లైన ఈశ్వరి, లక్ష్మి, డ్రైవర్ వెంకటేశన్‌తో సహా ముగ్గురిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు తన అపార్ట్‌మెంట్కు తరచూ వెళ్లేవారని, లాకర్‌ కీలు కూడా ఎక్కడ ఉన్నాయో వారికి తెలుసని పోలీసులకు తెలిపిన ఫిర్యాదులో పేర్కొంది.

Leave a Reply