తెలంగాణ

కేకులు వద్దు.. బిర్యానీలే ముద్దు.. మరీ ఇంత డిమాండా ?

శక్తి టీవీ, తెలంగాణ :- ఇయర్ ఎండ్, మంత్ ఎండ్, వీకెండ్ కావడంతో ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న రాత్రి 12 గంటలకు కేకులు కట్ చేసి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ, పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పేవారు .

ఒకప్పుడు బేకరీలు, మద్యం దుకాణాలలో రద్దీ ఎక్కువగా కనిపించేది. రోడ్లపై టెంట్లు వేసి మరి కేకులు అమ్మేవారు. గత ఏడాది నుంచి కేకులకు డిమాండ్ తగ్గి బిర్యానీకి ప్రాధాన్యత పెరుగుతుంది. రెస్టారెంట్లు , హోటళ్ల ముందు బిర్యానీ కోసం ఎగబడటం కూడా చూశాం. గత ఏడాది ఒక రెస్టారెంట్ లో 15 వేల కిలోల మాంసాంతో బిర్యాని వండించినా సరిపోలేదు. అంటే దీనిని బట్టి చూస్తే.. న్యూ ఇయర్ సందర్భంగా ఎంతమంది ఎన్ని బిర్యానీలు లాగించేస్తున్నారో అర్థం చేసుకోవాలి.

కొన్ని రెస్టారెంట్లు , హోటళ్లైతే బిర్యానీ ఆర్డర్లను అందిచలేక చేతులెత్తేశారు. అమీర్ పేట, మాదాపూర్, మణికొండ, నానక్ రాంగూడ, గచ్చిబౌలి ప్రాంతాల్లో తాత్కాలిక కిచెన్ లు ఏర్పాటు చేసి ఆర్డర్లు తీసుకుంటున్నారు. ఆర్డర్ రాగానే చికెన్, మటన్ బిర్యానీ వేడివేడిగా ప్యాక్ చేసి పంపిస్తున్నారు. ఇంకొన్ని రెస్టారెంట్లు కస్టమర్లను ఆకర్షించేందుకు న్యూ ఇయర్ కాంబో ఆఫర్లతో రెడీ అయ్యాయి. బిర్యానీతో పాటు కేక్ ను కూడా అందిస్తున్నాయి.

ఒక్క హైదరాబాద్ లోనే బిర్యానీకి ఇంత డిమాండ్ ఉందనుకుంటే పొరపాటే. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా బిర్యానీదే హవా. పైగా ఈసారి ఆదివారం కూడా కలిసొచ్చింది. బిర్యానీలు అమ్మే పాయింట్లు కూడా కుప్పలు తెప్పలుగా వెలిశాయి. రూ.100, రూ.200 కు బిర్యానీలు అమ్మేస్తున్నారు. న్యూ ఇయర్ పార్టీలో చిల్ అయ్యేందుకు బిర్యానీ ఒక్కటుంటే చాలన్నదే అందరి ఆలోచన.

Leave a Reply