వ్యూహంలో ప్రజారాజ్యం?.. పవన్‌ను కూడా టార్గెట్ చేశారా?
శక్తి టీవీ, వెబ్ డెస్క్: వ్యూహం సినిమాకి సంబంధించి మరో ఫోటో విడుదలైంది. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్ర టీజర్.. ఇప్పటికే సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన మరో ఫోటోను ఆర్జీవీ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్న ఫోటోను వర్మ విడుదల చేయగా.. అవి.. చిరంజీవి, అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్ ను పోలిన విధంగా ఉండటం.. చర్చనీయాంశంగా మారింది. ఆ ఫోటోను బట్టి చూస్తే సినిమాలో ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకొచ్చే అవకాశాలున్నట్లు సినీవర్గాలు అంటున్నాయి.
ఇప్పటికే వ్యూహం టీజర్ రాజకీయంగా సంచలనం రేపుతోంది. వైఎస్సార్ మరణం నుంచి జగన్ సీఎం అయ్యే వరకు.. అనేక అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. తండ్రి మరణంతో జగన్ అనుభవించిన మానసిక వేదన.. సీబీఐ అరెస్ట్ చేయడం.. జగన్ జీవితంలో భారతి రోల్.. చంద్రబాబు నెగెటివ్ షేడ్.. ఇలా కాంట్రవర్సీలను ఫుల్లుగా దట్టించి రాజకీయ వ్యూహం వదలబోతున్నారు వర్మ.
అయితే, టీజర్లో ఎక్కడా ప్రజారాజ్యం పాత్ర కనిపించలేదు. వైఎస్సార్ ఉన్నప్పుడే ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం.. చిరంజీవిని రాజ్యసభకు పంపించడం జరిగిపోయింది. మరి, లేటెస్ట్‌గా వర్మ వదిలిన ఫోటోలో చిరు, అరవింద్, పవన్ క్యారెక్టర్లు జగన్ ముందు కూర్చొని ఉండటం.. వ్యూహాత్మకంగా తీసిన సీనా? చంద్రబాబుతో పాటు పవన్‌నూ దెబ్బకొట్టే వ్యూహమా? మధ్యలో చిరంజీవి బ్లేమ్ అవరా? లేదంటే.. అది జస్ట్ ఫోటోకే పరిమితం అవుతుందా? సినిమాలోనూ మెజార్టీ రోల్ ఉంటుందా?