సీఐడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి
శక్తి టీవీ, విజయవాడ :- కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం విజయవాడలోని సిఐడీ రీజనల్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విజయసాయిని మినహా ఇంకా ఎవరినీ సీఐడీ అధికారులు లోపలకు అనుమతించలేదు.
కాకినాడ పోర్ట్ (Kakinada Port) వాటాల బదిలీ కేసు (Case)లో ఏపీ సీఐడీ (AP CID) అధికారులు రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijay Sai Reddy) కి నోటీసులు (Notices) ఇచ్చారు. బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో ఆయన ఈరోజు విజయవాడ సిఐడీ రీజనల్ కార్యాలయం (CID Regional Office)లో విచారణకు (Investigation) హాజరయ్యారు. కాకినాడ పోర్టులో వాటాను బలవంతంగా రాయించుకున్న వ్యవహారంపై విజయసాయిపై కేసు నమోదు చేశారు. అప్పుడు వాటాల్లో పాత్రధారులు, సూత్రధారులపై విజయసాయి రెడ్డిని సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
సీఐడీ కార్యాలయంలోకి విజయసాయి రెడ్డి మినహా ఇంకా ఎవరినీ అధికారులు లోపలకు అనుమతించలేదు. న్యాయవాదులకు కూడా అనుమతి లేదన్నారు. విజయసాయి రెడ్డి చెప్పే సమాధానాలపై వైసీపీ కీలక నేతల గుట్టు రట్టు అయ్యే అవకాశం ఉంది. విచారణలో ఏం చెబుతారోననే వైసీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా ఇటీవల వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్ (Kakinada Port Private Limited) అధిపతి కేవీ రావు (KV Rao)ను బెదిరించి అక్రమంగా వాటాలను తీసుకున్న కేసులో విజయసాయిపై కేసు (Case) నమోదైంది.కేవీ రావు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సీఐడీ.. వైసీపీ నేత సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డితో పాటు విజయసాయిపైనా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డిని ఏ-2గా, శరత్‌చంద్రారెడ్డి ఏ3గా ఉన్నారు. ఈ కేసులో ఈడీ కూడా కొన్నాళ్ల కిందట విజయసాయిని విచారించిన విషయం విదితమే.