బెంగళూరులో హైదరాబాద్ యువతి హత్య
శక్తి టీవీ, వెబ్ డెస్క్: ప్రేమించిన యువకుడి చేతిలోనే తెలంగాణ యువతి హత్యకు గురైంది. ఈ దారుణ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. హైదరాబాద్కు చెందిన ఆకాంక్ష విద్యాసాగర్(23), ఢిల్లీకి చెందిన అర్పిత్ అనే యువకుడు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి బెంగళూరు కోడిహళ్లిలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అయితే ఇద్దరం వేర్వేరుగా ఉందామని ఆకాంక్ష ప్రియుడికి చెప్పింది. ఈ విషయమై ఇద్దరి మధ్య కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. సోమవారం రాత్రి కూడా మరోసారి గొడవ జరగ్గా.. ఆగ్రహంతో ఊగిపోయిన అర్పిత్ యువతి మెడకు చున్నీ చుట్టి ఊపిరి ఆడకుండా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.