ఆంధ్రప్రదేశ్

టీడీపీ సీనియర్ నాయకుడు మృతి

శక్తి టీవీ, యలమంచిలి: విశాఖ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ లాలం భవాని భర్త టిడిపి సీనియర్ నాయకుడు లాలం భాస్కరరావు గుండెపోటుతో గురువారం ఉదయం విశాఖలో మృతి చెందారు. ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన ఆయన ఆకస్మిక మృతి పట్ల టిడిపి నాయకులు పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి టిడిపి నాయకులు తీవ్ర సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Leave a Reply