ఆంధ్రప్రదేశ్

ఇచ్ఛాపురంలో కూలిన పురాతన వంతెన

శక్తి టీవీ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో బ్రిటీష్ కాలం నాటి బ్రిడ్జీ కూలిపోయింది. ఒడిశాలోని అస్కా నుంచి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 70 టన్నుల గ్రానైట్‌ రాళ్ల లోడుతో లారీ వెళుతోంది. భారీ వాహనాలు జాతీయ రహదారిపై వెళ్లాల్సి ఉండగా.. లారీ డ్రైవర్ మాత్రం ఇచ్ఛాపురం పట్టణంలోకి వచ్చాడు. ఈ క్రమంలో లారీ బాహుదా నది వంతెనపైకి రాగానే ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో లారీ కిందికి పడిపోయింది. నదిలో నీరు లేకపోవడం, ఇతర వాహనాలు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. లారీలో ఉన్న డ్రైవర్‌, క్లీనర్‌కు మాత్రం స్వల్పగాయాలయ్యాయి. వంతెన కూలిపోవడంతో ఇచ్ఛాపురం పట్టణంలోకి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 1929లో బాహుదా నదిపై ఈ వంతెనను బ్రిటీష్ పాలకులు నిర్మించారు.

Leave a Reply