ఆంధ్రప్రదేశ్

విశాఖ ఉక్కు EOIలో బిడ్ వేసిన జేడీ లక్ష్మీనారాయణ

విశాఖ : స్టీల్ ప్లాంట్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్(EOI) అనూహ్య స్పందన వచ్చింది. బిడ్డింగ్ లో పాల్గొనేందుకు 22 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో ఎక్కువగా బడా కంపెనీలే ఉన్నాయి. తెలంగాణ నుంచి సింగరేణి సంస్థ కూడా బిడ్డింగ్ కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(JD Laxmi Narayana) ఓ ప్రైవేట్ సంస్ధ తరపున బిడ్ వేశారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం నియంతత్వ ధోరణీని అడ్డుకుంటామని జేడీ పేర్కొన్నారు. కార్మికులందరూ తలా రూ.400 ఇస్తే ప్లాంట్ ను కాపాడుకోవచ్చని ఆయన సూచించారు. కాగా ఇవాళ ఉదయం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం నుంచి సింహాచలం వరకు కార్మికులు చేపట్టిన పాదయాత్రకు జేడీ మద్దతు తెలిపారు.

Leave a Reply