తెలంగాణ

తెలంగాణలో కరోనా బులిటెన్ విడుదల.. స్వల్పంగా పెరిగిన కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 18 కొత్త కేసులు వెలుగుచూశాయి. కరోనా మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి.. భౌతిక దూరాన్ని పాటించించాలని సూచించింది.

Leave a Reply