ఎండీసీని ఊడ్చేసిన ఆప్..! -ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ.!
ఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ దూసుకుపోతోంది. మొత్తం 250డివిజన్లలో 134డివిజన్లను ఆప్ కైవసం చేసుకోగా, బీజేపీ 104, కాంగ్రెస్ 9సీట్లను గెలుచుకున్నాయి. ఈ నెల నాల్గవ తేదీన పోలింగ్ జరిగింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉన్నా.. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మాత్రం బీజేపీ కంట్రోల్లోనే ఉంది. తాజా ఎన్నికల్లో బీజేపీ 15ఏళ్ల పాలన(హవా)కు ఆప్ గండికొట్టింది. 2017లో జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీ 181 డివిజన్లు గెలుచుకుంది.
ఇక ఆమ్ఆద్మీపార్టీ విషయానికొస్తే… ఎంసీడీ ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా ప్రణాళిక తయారు చేశారు ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్. ముందుగా ఢిల్లీ ఓటర్లకు 10 కీలక హామీలు ఇచ్చారు. మునిసిపల్ కార్పొరేషన్ లో అవినీతిని అంతం చేయడానికి టాప్ ప్రయారిటీ ఇస్తామన్నారు. చెత్త సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ఢిల్లీ నగరాన్ని సుందరీకరణ చేయడానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు కేజ్రీవాల్. ఎంసీడీ ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిల పడటం గమనార్హం.