ఆంధ్రప్రదేశ్

చెరువులో పడి బాలుడు మృతి

టెక్కలి : టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలం పెద్ద తామరపల్లి గ్రామానికి చెందిన కొత్తూరు త్రినాధరావు కుమారుడు హేమాన్స్ దత్త ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. దత్త మంగళవారం సాయంత్రం నుండి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రి చుట్టుపక్కల వెతికారు. అయితే ఈరోజు గ్రామ సమీపంలోని చెరువులో చిన్నారి మృతదేహం కనిపించిందని అన్నారు. అల్లారి ముద్దుగా పెంచుకున్న చిన్నారి వేగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Leave a Reply