తెలంగాణ

తెలంగాణ ఇంచార్జి డీజీపీగా అంజనీ కుమార్

హైదరాబాద్‌ : సీఐడీ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్

రాచకొండ సీపీగా డీఎస్ చౌహాన్

ఏసీబీ డీజీగా రవి గుప్తాకు అదనపు బాధ్యతలు

శాంతిభద్రతల డీజీగా సంజయ్‌కుమార్ జైన్

తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా అంజ‌నీకుమార్ నియమితులయ్యారు. ప్ర‌స్తుత డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ఈ నెల 31న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఇంచార్జీగా డీజీపీగా అంజనీ కుమార్‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుతం అంజ‌నీకుమార్ ఏసీబీ డీజీగా కొన‌సాగుతున్నారు. ఇక రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్‌గా డీఎస్ చౌహాన్‌ను నియ‌మించారు. రాచ‌కొండ సీపీగా కొన‌సాగుతున్న మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌ను.. సీఐడీ అడిష‌న‌ల్ డీజీగా నియమించారు. ఏసీబీ డీజీగా ర‌విగుప్తాకు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. తెలంగాణ అగ్నిమాప‌క శాఖ డీజీగా జితేంద‌ర్, లా అండ్ ఆర్డ‌ర్ డీజీగా సంజ‌య్ కుమార్ జైన్ నియామ‌కం అయ్యారు.

అంజనీ కుమార్ 1990 బ్యాచ్ ఐపిఎస్ అధికారి. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్నారు. 2021 డిసెంబరు 24న ఏసీబీ డీజీ అయ్యారు. అంతకుముందు హైదరాబాద్ నగర కమిషనరుగా పనిచేశారు. ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్ (పీస్ మెడల్) రెండుసార్లు అందుకున్నారు. గతంలో జనగామ ఏఎస్పీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రేహౌండ్స్ చీఫ్‌, నిజామాబాద్ డీఐజీ, వరంగల్ ఐజీ,

హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అదనపు కమిషనరుగా అంజనీ కుమార్ పని చేశారు. తెలంగాణ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా కూడా సేవలందించారు. అయితే, అంజనీకుమార్ ఆంధ్రా క్యాడర్ ఐపీఎస్ కావడంతో గందరగోళం నెలకొంది. ఇప్పటికే సీఎస్‌ సోమేష్ కుమార్ పోస్టింగుపై కేసు కొనసాగుతోంది. అంజనీకుమార్ పైనా ఆ కేసు ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇన్ చార్జీ డీజీపీగా నియమించినట్లు సమాచారం.

Leave a Reply