తెలంగాణ

జనవరి 1 నుంచి నుమాయిష్‌..ఎన్ని రోజులంటే..?

శక్తి టీవీ, తెలంగాణ :- జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 15 రోజుల పాటు జరిగే నుమాయిష్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌డ్డి చేతులమీదుగా ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు.

పారిశ్రామిక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 15 రోజుల్లో లక్షలాది మంది ప్రజలు ప్రదర్శనను సందర్శిస్తారన్నారు. పారిశ్రామిక విప్లవం తర్వాత ఇదొక పెద్ద వేదికగా మారిందన్నారు. ఈసారి 2,400 పైచిలుకు ఎగ్జిబిటర్లు రాష్ట్రానికి రానున్నట్లు వెల్లడించారు.

తొలిసారిగా శాకాహారం రెస్టారెంట్‌ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రదర్శనకు వచ్చే సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని శ్రీధర్ బాబు సూచించారు. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో కరోనా వైద్య పరీక్షలు కూడా చేయాలని సూచించారు. రాష్ట్రంల నుమాయిష్‌ను విజయవంతం చేయాలని ఆయన అని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply