తెలంగాణ

“పార్లమెంట్ ఎన్నికల్లోనూ BRS, BJP గుర్తులను 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెడతా..”

శక్తి టీవీ, తెలంగాణ :- పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ BRS, BJP గుర్తులను 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెడతానని.. లండన్‌ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు అని, ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిపైనే తన దృష్టి ఉందని అన్నారాయన. తెలంగాణను నెంబర్‌వన్‌గా నిలిపేందుకు… పొరుగు రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతోనే పోటీ పడతానని రేవంత్‌రెడ్డి చెప్పారు.

తెలంగాణలోనే కాదు.. విదేశాల్లోని తెలుగువారిలోనూ సీఎం రేవంత్‌రెడ్డి అంటే ఫుల్‌ క్రేజ్, ఫుల్‌ జోష్. ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డికి తెలుగువారి ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఆయన్ని చూసేందుకు, కలిసి మాట్లాడేందుకు తెలుగువారు చాలా ఆసక్తి చూపుతున్నారు. రాత్రి అయినా సరే.. క్యూ లైన్‌లో నిలబడి మరీ వేచి ఉండి సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

ఇక సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే సదస్సుల్లో అయితే.. తెలుగువారి సందడి మామూలుగా ఉండటం లేదు. తెలంగాణలో జరిగే బహిరంగ సభల్లో రేవంత్‌రెడ్డిని చూసి అంతా కేరింతలు కొట్టినట్టే.. లండన్‌లోనూ రేవంత్‌రెడ్డి కనిపించగానే తెలుగు వారంతా సీఎం, సీఎం, జై రేవంత్‌ అనే నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

రేవంత్ తన ప్రసంగంలో NTR, చంద్రబాబు, YS రాజశేఖర్‌రెడ్డి పేర్లు ప్రస్తావించగానే.. జనం నుంచి స్పందన ఓ రేంజ్‌లో ఉంది. రేవంత్‌ ప్రసంగం కూడా వినిపించనంతా గట్టిగా.. అంతా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈ వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

Leave a Reply