నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
శక్తి టీవీ, అమరావతి :- ఉపముఖ్యమంత్రిగా పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో మంగళవారం సచివాలయానికి పవన్ రానున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి పనులను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టగా…ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం గా బాబు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అధికారులను, పనులను ఉరుకులు పెట్టిస్తున్నారు.
ఇప్పటికే సోమవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన బాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఉపముఖ్యమంత్రిగా పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి పవన్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను చంద్రబాబు కేటాయించిన విషయం తెలిసిందే. బుధవారం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో మంగళవారం సచివాలయానికి పవన్ రానున్నారు.
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి పవన్ రాబోతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయానికి పవన్ చేరుకుంటారు. రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ ను పవన్ పరిశీలిస్తారు. పవన్ కల్యాణ్ అమరావతికి వస్తున్న నేపథ్యంలో ఘనంగా స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్ కు మానవహారంతో పూలు చల్లి స్వాగతం తెలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.