నేడు ఢిల్లీ విమానాశ్రయానికి రామ్ చరణ్.. అనంతరం ప్రధానితో భేటీ
ఢిల్లీ : ‘RRR’ సినిమాతో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకుంటున్నారు. నేరుగా ఆస్కార్ వేదిక నుంచి దేశ రాజధానికి చేరుకోనున్న చరణ్.. ఓ ఇంగ్లిష్ ఛానెల్ నిర్వహిస్తున్న కాంక్లేవ్‌లో పాల్గొంటారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అవ్వనున్నట్లు తెలుస్తోంది. అనంతరం రామ్ చరణ్ సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రానున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత అమెరికా నుంచి మొదటిసారిగా భారత్ చేరుకుంటున్న చరణ్‌కు ఘనస్వాగతం పలికేందుకు ఢిల్లీలోని తెలుగు సంఘాలు, అభిమానులు ఏర్పాట్లు చేసుకున్నారు.