చంద్రబాబును ఇక ఏ శక్తీ ఆపలేదు : టీపీడీ శ్రేణులు
శక్తి టీవీ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాదాపుగా రెండు నెలలు పాటు రాజమహేంద్ర వరం కారాగారంలోనే ఉన్నాయి. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అయితే ఆయన బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా.. ప్రతిసారి నిరాశే ఎదురైంది. ఇప్పుడు తాజాగా ఆయన అనారోగ్య సమస్యల వల్ల హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు బాబుకు బెయిల్ మంజూరు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. “చంద్రబాబు బయటకు వస్తున్నారు. ఇక బాబును ఆపే శక్తి లేదు. ఆయన మళ్లీ జైలుకు వెళ్లే ఛాన్సే లేదు. ఇక జగన్ ఆట కట్టడమే తరువాయి. వైసీపీ నేతలకు ఒక్కొక్కళ్లకు చుక్కలే ఇక. జైలు నుంచి బాబు కాలు బయటపెట్టిన మరుక్షణం నుంచే జగన్ సామ్రాజ్య పతకనం మొదలవుతుంది. ఇక చంద్రబాబును ఏ శక్తీ ఆపలేద. అన్ని కేసులూ అక్రమం అని త్వరలోనే తేలిపోతుంది.” అని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.