ఆంధ్రప్రదేశ్

గిరిజనులకు తప్పని డోలిమోత కష్టాలు

అరకు వ్యాలీ : అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారుమూల గ్రామాల్లో గిరిజనులకు రహదారి కష్టాలు వెంటాడుతుంది. అనంతగిరి మండలంలోని పినకోట పంచాయతీ పరిధి రాచకీలం గ్రామంలో కొద్దిరోజుల నుంచి మలేరియా జ్వరంతో బాధపడుతున్న సూకూరు. సింహాచలాన్ని మంగళవారం కుటుంబీకులు రాచకిలం నుండి బల్లగరువు వరకు డోలి కట్టి అక్కడి నుండి దేవరపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వం అధికారులు స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావు గిరిజన సంఘం నాయకుడు జమ్మరాజు తదితరులు డిమాండ్ చేశారు.

Leave a Reply