స్పా పేరిట వ్యభిచారం..పోలీసుల దాడులు
శక్తి టీవీ, ఖైరతాబాద్: మర్దన పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్న 2 స్పా కేంద్రాల పై పోలీసులు సోమవారం రాత్రి దాడులు జరిపారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని హెవెన్ ఫ్యామిలీ స్పాపై, అదే మార్గంలోని వెల్వెట్ స్పా కేంద్రంపై ఎస్ఐ కరుణాకర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. రెండు చోట్ల 17 మంది యువతులను రెస్క్యూ చేసి, పునరావాస కేంద్రానికి తరలించారు. ఇద్దరు మేనేజర్లను, నిర్వాహకురాలు, విటులను అరెస్ట్ చేశారు.