కుక్కల వేటకు గొర్రెల మంద బలి
పలాస : శ్రీకాకుళం జిల్లా, మందస మండలం, కొంకడ పుట్టి పంచాయతీ, సందూరు గ్రామం లో తాడేల పాపారావు అనే వ్యక్తి యొక్క గొర్రెల మందలో నాలుగు కుక్కలు దూరి వాటి ఇష్టానుసారం చెలరేగి గొర్రెలని చల్లా చదివిగా చేసి నాలుగు గొర్రెలను చంపి అందులో ఒక దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తిన్నాయి. అటువైపుగా వెళుతున్న ఇద్దరు అమ్మాయిలు వాటిని చూసి గొర్రెల కాపరి అయిన తాడేల పాపారావుకు ఫోన్ చేసి చెప్పగా అంతలో వెళ్లేసరికి నాలుగింటిని చంపి కుక్కలు అక్కడ నుండి వెళ్లిపోయాయి. ఇటీవల కొద్ది రోజుల క్రితం బస్సు ప్రమాదంలో 10 గొర్రెలు మరణించాయి, ఆ విషయాన్ని తేరుకునే లోగా మళ్లీ ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉందని గొర్రెల కాపరైన తాడేల పాపారావు అన్నారు.